Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Home › బ్రేకింగ్ న్యూస్ › గణపతి సేవలో వేణుకు ఘన సన్మానం
బ్రేకింగ్ న్యూస్

గణపతి సేవలో వేణుకు ఘన సన్మానం

01:20 మధ్యాహ్నం PM

మూడు సంవత్సరాలుగా ఎలాంటి పారితోషికం ఆశించకుండా వంటల సేవ.. యువత ఘనంగా అభినందన

మంథని, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): దైవభక్తితో సేవ చేస్తూ, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గణపతి ఉత్సవాల్లో తన వంతు సహకారం అందిస్తున్న వేణును గంగాపురి యూత్ గణపతి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

గంగాపురి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద గత మూడు సంవత్సరాలుగా వేణు స్వచ్ఛందంగా వంటలు వండుతూ భక్తులకు నిర్వహించే కార్యక్రమాల్లో తన సేవలను అందిస్తున్నారు. ఎలాంటి పారితోషికం ఆశించకుండా గణపతిపై ఉన్న భక్తి, విశ్వాసంతో యువతతో కలిసి సేవ చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.

వేణు అందిస్తున్న సేవలను గుర్తించిన గంగాపురి యూత్ గణపతి యువకులు మండపం వద్ద ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. దైవభక్తితో పాటు స్నేహభావంతో, యువత పట్ల ఆప్యాయతతో వేణు అందిస్తున్న సేవలు తమకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. గణపతిపై ఉన్న భక్తితోనే గత మూడు సంవత్సరాలుగా యూత్ గణపతి వద్ద వంటల సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి పారితోషికం ఆశించకుండా గణపతికి, యువతకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

యువత చూపిస్తున్న ప్రేమాభిమానాలు, తనకు అందించిన సన్మానం ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఇదే విధంగా సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.

దైవభక్తితో కూడిన సేవకు గుర్తింపుగా వేణును సన్మానించిన గంగాపురి యువతను పలువురు అభినందించారు.

— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 48🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App