కరీంనగర్, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): గణేష్ నిమజ్జన ఉత్సవాలను యువత శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. చిన్న పిల్లలు చెరువులు, నీటి వనరుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు, గణేష్ మండలి నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
కరీంనగర్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని కరీంనగర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నిమజ్జన ఉత్సవాల నిర్వహణ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక బడ్జెట్ కేటాయించినట్లు బండి సంజయ్ తెలిపారు. నగరంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్తో సమావేశమయ్యారు.
గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు, చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో మంత్రి చర్చించి పలు సూచనలు చేశారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply