మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
17న అన్ని తండాల్లో కేసీఆర్‌కు పాలాభిషేకం చేయాలి: బీఆర్ఎస్ నేతల పిలుపు
దేవరకొండ: రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి అన్ని రంగాల్లో పెద్దపీట వేసింది మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ అధ్యక్షతన దేవరకొండలోని ఆయన నివాసంలో నిర్వహించిన గిరిజన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. 500కు పైగా జనాభా ఉన్న తండాలను గుర్తించి వాటిని గ్రామపంచాయతీలుగా మార్చి, గిరిజనులు తమ తండాల్లోనే స్వయంపాలన చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు.
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజనులకు రాజకీయంగా కూడా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనులు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 17వ తేదీన రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాల్లో కేసీఆర్‌కు పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, కేతావత్ భీల్యా నాయక్, ఇస్లావత్ అభిషేక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
– Ayush 24 News
The Voice of Truth
గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ కృషి మరువలేనిది – మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి 17న అన్ని తండాల్లో కేసీఆర్‌కు పాలాభిషేకం చేయాలి: బీఆర్ఎస్ నేతల పిలుపు దేవరకొండ: రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి అన్ని రంగాల్లో పెద్దపీట వేసింది మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply