గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026లో ప్రతిష్ఠాత్మక పురస్కారం
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో డా. రామావత్ శంకర్ నాయక్, ఎం.డి., జనరల్ సర్జన్‌కు గ్లోబల్ బుద్ధ అవార్డు–2026 లభించింది.
హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సెప్టెంబర్ 20న నిర్వహించనున్న ఈ అవార్డుల కార్యక్రమాన్ని Amateur Sports & Culture Awards Association ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని మాస్టర్ అమర్ సింగ్ మరియు మాస్టర్ కేశవ్ గౌడ్ నిర్వహిస్తున్నారు.
డా. రామావత్ శంకర్ నాయక్ ప్రస్తుతం లక్ష్మీ విజయ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌లో చైర్మన్ & జనరల్ సర్జన్‌గా సేవలందిస్తున్నారు. వైద్య సేవలు, సామాజిక సేవ, ప్రతిభకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డా. రామావత్ శంకర్ నాయక్‌కు పలువురు అభినందనలు తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి సమాజానికి మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
🏆 గ్లోబల్ బుద్ధ అవార్డు–2026 విజేతగా డా. రామావత్ శంకర్ నాయక్‌కు ఆయుష్ 24 న్యూస్ తరఫున హృదయపూర్వక అభినందనలు. 💐👏
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply