మెదక్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): మెదక్ పట్టణంలోని దయారా వీధికి చెందిన గొల్ల సిద్ధ రాములు చెరువులో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
సిద్ధ రాములు మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానికులు ఆయన కుటుంబ పరిస్థితిని డాక్టర్ మోహన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మృతుడి స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, కష్టకాలంలో అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ రవి, బీసీ సెల్ టౌన్ అధ్యక్షుడు భూపతి, సురేష్, బాలకృష్ణతో పాటు మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply