Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › జయశంకర్ జిల్లాలో నాన్ పొలిటికల్ ఆటో జేఏసీ నూతన కమిటీ ఎన్నిక
బ్రేకింగ్ న్యూస్

జయశంకర్ జిల్లాలో నాన్ పొలిటికల్ ఆటో జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

11:48 ఉదయం AM

అయుష్ 24 న్యూస్ ప్రతినిధి

భూపాలపల్లి, సెప్టెంబర్ 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాన్ పొలిటికల్ ఆటో జేఏసీ నూతన జిల్లా కమిటీని గురువారం ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలోని సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలోని బాతాల రాజన్న భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

వావిలాల లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నాన్ పొలిటికల్ ఆటో జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కన్వీనర్‌గా ఆటో కార్మికుడు వావిలాల లక్ష్మణ్, కో-కన్వీనర్‌గా మేడ భాస్కర్‌ను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ నాన్ పొలిటికల్ ఆటో జేఏసీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నాన్ పొలిటికల్ ఆటో జేఏసీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయకుండా, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు.

జిల్లా కన్వీనర్ వావిలాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాకు జిల్లా కేంద్రం నుంచి ఆటో కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో ఆటో కార్మికుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అన్ని మండలాలు, గ్రామాల్లో ఆటో కార్మికులు, అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, ముఖ్యంగా ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని వావిలాల లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 15న ఇందిరాపార్క్‌లో నిర్వహించనున్న ధర్నాకు వేలాది మంది ఆటో కార్మికులతో తరలివస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ మేడ భాస్కర్‌తో పాటు అంబాల సంపత్, ఏ. మధుకర్, ఎం. మహేష్, పి. రవితేజ, తాళ్లపెల్లి సతీష్, బి. సుమన్, బక్కయ్య, గుంటుక పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *