Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు
Home › బ్రేకింగ్ న్యూస్ › తల్లాడ మండలంలో అదనపు కలెక్టర్ డా. శ్రీజ పర్యటన
బ్రేకింగ్ న్యూస్

తల్లాడ మండలంలో అదనపు కలెక్టర్ డా. శ్రీజ పర్యటన

09:04 ఉదయం AM

పినపాకలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో మొక్కలు నాటిన డా. శ్రీజ

తల్లాడ మహిళా మార్ట్ పనుల తనిఖీ.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

తల్లాడ, సెప్టెంబర్ 19 (అయుష్ 24 న్యూస్ ప్రతినిధి): ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డా. శ్రీజ శనివారం తల్లాడ మండలంలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పినపాక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా డా. శ్రీజ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని సూచించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో హరితోత్సవం

కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్ డీఈవో సదానందం, ఎంపీడీవో శ్రీధర్ రాజు, ఎంఈవో దామోదర ప్రసాద్, ఏపీవో కోటయ్య, ఈసీ అరుంధతి, సాంకేతిక సహాయకులు నజీర్, సునిత, ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శి పరశురామ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిద్ధారావు, ఫీల్డ్ అసిస్టెంట్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మహిళా మార్ట్ పనుల ఆకస్మిక తనిఖీ

అనంతరం తల్లాడ మండలంలో నిర్మాణంలో ఉన్న మహిళా మార్ట్ పనులను అదనపు కలెక్టర్ డా. శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని ఎంపీడీవో శ్రీధర్ రాజు, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా మార్ట్ అందుబాటులోకి వస్తే స్వయం సహాయక మహిళా సంఘాలు, గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం లభిస్తుందని, తద్వారా వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని డా. శ్రీజ పేర్కొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 45🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
22 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App