జయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి
ఇల్లందు, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:
కొత్త తండా (పి) గ్రామపంచాయతీ పరిధిలోని మాలపల్లి గ్రామంలో గురుప్రసాద్ తల్లి జయమ్మ దశదిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ హాజరై జయమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్కినేని శ్యామ్, స్థానిక నాయకులు సుధాకర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply