Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
బ్రేకింగ్ న్యూస్

నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

03:51 మధ్యాహ్నం PM

“మన ఊరు – మన కోచింగ్ సెంటర్”లో భాగంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

కాటారం, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): మంథని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో “మన ఊరు – మన కోచింగ్ సెంటర్” కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులను కాటారం మండల కేంద్రంలోని సువిద్య స్కూల్‌లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ప్రారంభించారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విశ్వ అకాడమీ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన అనంతరం దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ, మంథని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకున్న యువతకు నిపుణులైన అధ్యాపకుల ద్వారా నాణ్యమైన శిక్షణ అందించడంతో పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడమే ఈ ఉచిత శిక్షణ తరగతుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని దుద్దిళ్ల శ్రీను బాబు ఆకాంక్షించారు. ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలతో పాటు మంథని నియోజకవర్గానికి గర్వకారణంగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 13🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *