మంథని, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా ఆరెల్లి కిరణ్ గౌడ్ నియమితులైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
కమాన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అన్వర్, మంథని మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెల్లి కిరణ్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి, నూతన బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కిరణ్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆశీస్సులతో తనకు రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా బాధ్యతలు లభించాయని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ సోషల్ మీడియా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని కిరణ్ గౌడ్ తెలిపారు.
ఆరెల్లి కిరణ్ గౌడ్‌కు రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా నూతన బాధ్యతలు లభించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, సర్పంచులు జాడి రామస్వామి, గుమ్మడి సమ్మయ్య, రంగు సత్యనారాయణ, తోట పోశం, బెల్లంకొండ సత్యనారాయణ రెడ్డి, గట్టు దామోదర్, మాజీ సర్పంచ్ దొరగొల్ల శ్రీనివాస్, అక్కపాక సంపత్ తదితరులు పాల్గొన్నారు.
AYUSH 24 NEWS
The Voice of Truth










Leave a Reply