చందంపేట, సెప్టెంబర్ 17: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా చందంపేట మండలం పోలేపల్లి క్రాస్‌రోడ్డులోని చిత్రియాల ప్రాథమిక సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో గురువారం వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జాలే నరసింహారెడ్డి మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగాలని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు అంకులయ్య, ఇప్ప తిరుపతిరెడ్డి, హరీశ్ చారి, ఆంజనేయులు, వంశీ, కార్తీక్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply