దేవరకొండ, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ వేడుకలను బొడ్డుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, మహిళా ఆరోగ్య కార్యకర్తలు కలిసి సామూహికంగా బతుకమ్మ ఆడి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ మహిళలకు ఎంతో ఇష్టమైన పూల పండుగ అని తెలిపారు. తొమ్మిది రోజులపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు.
పీహెచ్సీ పరిధిలోని మహిళలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ పరిధిలోని మహిళలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
– ఆయుష్ 24 న్యూస్
బొడ్డుపల్లి పీహెచ్సీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
దేవరకొండ, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ వేడుకలను బొడ్డుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, మహిళా ఆరోగ్య కార్యకర్తలు కలిసి సామూహికంగా బతుకమ్మ ఆడి సందడి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply