Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › యువతకు ఉపాధి దిశగా మరో అడుగు.. దేవరకొండలో ఉచిత శిక్షణా కేంద్రాలు ప్రారంభం
బ్రేకింగ్ న్యూస్

యువతకు ఉపాధి దిశగా మరో అడుగు.. దేవరకొండలో ఉచిత శిక్షణా కేంద్రాలు ప్రారంభం

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనే లక్ష్యంగా.. గ్రామీణ యువత మరియు మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు దేవరకొండ పట్టణంలో 'విలేజ్ డెవలప్ సొసైటీ' మరో కీలక ముందడుగు వేసింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం 'విలేజ్ డెవలప్ సొసైటీ' ఆధ్వర్యంలో ఉచిత వృత్తి విద్యా

03:38 మధ్యాహ్నం PM

విలేజ్ డెవలప్ సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల మూడో బ్యాచ్‌లు ప్రారంభం

దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

గ్రామీణ యువత, మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు దేవరకొండ పట్టణంలో విలేజ్ డెవలప్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి విద్యా శిక్షణా కేంద్రాల మూడో విడత బ్యాచ్‌లను ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల కొత్త బ్యాచ్‌లను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హెల్త్ సీహెచ్‌ఓ ఆర్. గోపాల్ సింగ్, రిటైర్డ్ కండక్టర్ ధరం సింగ్, ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్, మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బోయిని చంద్రమౌళి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో నిరుద్యోగ యువత, మహిళలు చేతివృత్తులతో పాటు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పొందవచ్చని పేర్కొన్నారు. దేవరకొండ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్న విలేజ్ డెవలప్ సొసైటీ సేవలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్ సొసైటీ కోఆర్డినేటర్ భాషా చౌహాన్, నాయకులు టీక్య నాయక్, గోవర్ధన్, ఎన్. శాంతి, కే. కవిత, బి. నిహారిక తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణా తరగతులను యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 25🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
15 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App