Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › తాజా వార్తలు › వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో ఓవరాల్ గ్రాండ్ ఛాంపియన్‌గా ఉపేందర్ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ
తాజా వార్తలు

వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో ఓవరాల్ గ్రాండ్ ఛాంపియన్‌గా ఉపేందర్ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ

06:42 ఉదయం AM

60 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్య పతకాలతో ఘన విజయం

హైదరాబాద్, ఆగస్టు 24, అయుష్ 24 న్యూస్: హైదరాబాద్‌లో ఆగస్టు 21, 22, 23 తేదీల్లో నిర్వహించిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026లో ఉపేందర్ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ (UTMA) క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఓవరాల్ గ్రాండ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.

సిరికొండ ఉపేందర్ మాస్టర్ నాయకత్వంలో, UTA వ్యవస్థాపకులు, సీనియర్ తైక్వాండో మాస్టర్, బ్లాక్ బెల్ట్ 6వ డాన్ శ్రీ ఎస్.ఏ. మొయినుద్దీన్ మాస్టర్ మార్గదర్శకత్వంలో టీమ్ ఈ ఘన విజయాన్ని సాధించింది.

115 మంది సభ్యులు.. 139 ఈవెంట్ ఎంట్రీలు

ఈ ఛాంపియన్‌షిప్‌లో ఉపేందర్ మాస్టర్ టీమ్ తరఫున మొత్తం 115 మంది పాల్గొనగా, వివిధ విభాగాల్లో 139 ఈవెంట్ ఎంట్రీలు నమోదయ్యాయి.

క్రీడాకారులు సాధించిన పతకాలు:

🥇 60 బంగారు పతకాలు
🥈 35 వెండి పతకాలు
🥉 32 కాంస్య పతకాలు

అదేవిధంగా టోర్నమెంట్‌లో 18 మంది రిఫరీలు సేవలందించారు.

విభాగాల వారీగా ఎంట్రీలు

🥋 క్యోరుగి: 60
🥋 పూమ్సే: 35
🦵 స్పీడ్ కికింగ్: 20
👊 స్పీడ్ పంచింగ్: 24

కఠోర శ్రమ, క్రమశిక్షణ, సమిష్టి కృషి, అద్భుతమైన టీమ్‌వర్క్‌తో క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఓవరాల్ గ్రాండ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని సాధించారు.

మాస్టర్స్‌కు ప్రత్యేక అభినందనలు

UTA వ్యవస్థాపకులు, సీనియర్ తైక్వాండో మాస్టర్, బ్లాక్ బెల్ట్ 6వ డాన్ శ్రీ ఎస్.ఏ. మొయినుద్దీన్ మాస్టర్, అలాగే UTMA వ్యవస్థాపకులు, సీనియర్ తైక్వాండో మాస్టర్ శ్రీ సిరికొండ ఉపేందర్ మాస్టర్కు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఉత్తమ్ మాస్టర్, నారాయణ రోకయ్య మాస్టర్, అమన్ మాస్టర్, అనిల్ మాస్టర్, ఉమాకాంత్ మాస్టర్, సాయి అర్జున్ మాస్టర్, అక్షయ్ మాస్టర్, శేఖర్ మాస్టర్, అనీష్ మాస్టర్, మనీష్ మాస్టర్, సాయి కిరణ్ మాస్టర్, సాయి చంద్ నాయక్ మాస్టర్, శివ మాస్టర్, అశోక్ మాస్టర్, అమాన్ మాస్టర్‌తో పాటు ఇతర మాస్టర్లు, కోచ్‌లు, రిఫరీలు, క్రీడాకారులను అభినందించారు.

అలాగే P. భాను తేజ, B. యశ్వంత్, కౌశిక్ గౌడ్, చరణ్, శశాంక్ సిరికొండ, నిశాంక్ సిరికొండ, సహస్ర, కౌశిక్ యాదవ్, కేతుర, సానియా తదితర క్రీడాకారుల కృషిని ప్రశంసించారు.

నిర్వాహకుల అభినందనలు

ఈ ఛాంపియన్‌షిప్ ఘన విజయంలో సిరికొండ ఉపేందర్ మాస్టర్, ఎస్.ఏ. మొయినుద్దీన్ మాస్టర్, వారి అకాడమీ బ్రాంచ్‌ల మాస్టర్లు, కోచ్‌లు, రిఫరీలు, క్రీడాకారులు అందించిన సహకారం అభినందనీయమని AMICAL SPORTS ACADEMY, AMICAL SPORTS FEDERATION, JR INTERNATIONAL TAEKWONDO ACADEMY ప్రతినిధులు పేర్కొన్నారు.

1st World Open Taekwondo Championship–2026 Event Organising Technical Manager రాథోడ్ రాజు నాయక్ కూడా ఉపేందర్ మాస్టర్ మరియు వారి టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ విజయం హైదరాబాద్, తెలంగాణతో పాటు భారతదేశ తైక్వాండో క్రీడా రంగానికి గర్వకారణమని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఉపేందర్ మాస్టర్ మరియు వారి యావత్ టీమ్ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు, ట్రోఫీలు సాధించాలని ఆకాంక్షించారు.

అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
693 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App