దేవరకొండ: వర్షాలు సమృద్ధిగా కురిసి కరువు పరిస్థితులు తొలగిపోవాలని, పాడిపంటలు సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ దేవరకొండ ఈద్గా మైదానంలో ఆదివారం ముస్లిం సోదరులు ప్రత్యేకంగా ఇస్తిస్కా నమాజ్ నిర్వహించారు.
హజ్రత్ మౌలానా ముఫ్తీ సయ్యద్ అమ్జద్ అలీ ఖాస్మీ సాహెబ్ (ఖతీబ్-ఏ-ఈదైన్, దేవరకొండ) ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఈద్గా మైదానానికి చేరుకుని ఇస్తిస్కా నమాజ్‌ను భక్తిశ్రద్ధలతో ఆచరించారు.
నమాజ్ అనంతరం మౌలానా సయ్యద్ అమ్జద్ అలీ ఖాస్మీ సాహెబ్ ప్రత్యేక దువా నిర్వహించారు. అల్లాహ్ తాలా తన కరుణను కురిపించి సమృద్ధిగా వర్షాలు కురిసేలా చేయాలని, చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండాలని, రైతుల పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థించారు.
అలాగే పాడిపంటలు సస్యశ్యామలంగా మారి రైతులు, కూలీలు, వ్యాపారులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం, సౌభాగ్యం నెలకొనాలని అల్లాహ్‌ను వేడుకున్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఏకమై వర్షాల కోసం ప్రార్థనలు చేయడం విశేషంగా నిలిచింది. ఇస్తిస్కా నమాజ్ అనంతరం ప్రజలు పరస్పరం శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీమోద్దీన్, షబ్బీర్ అహ్మద్, ముఫ్తీ రిజ్వన్, మాజీద్ మౌలానా, హబీబ్ మౌలానా, ఇలియాస్ పటేల్, ఖుద్రతుల్లా, బషీర్ సాబ్, అలీమ్ మౌలానా, ఫయాజోద్దీన్, ముజీబ్, ఖాజా, దస్తగిర్, షబ్బీర్, వాజీద్ పాషా, ఖలేఖ్, ఖైసర్ తదితరులతో పాటు దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice of Truth Media
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు
దేవరకొండ: వర్షాలు సమృద్ధిగా కురిసి కరువు పరిస్థితులు తొలగిపోవాలని, పాడిపంటలు సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ దేవరకొండ ఈద్గా మైదానంలో ఆదివారం ముస్లిం సోదరులు ప్రత్యేకంగా ఇస్తిస్కా నమాజ్ నిర్వహించారు. హజ్రత్ మౌలానా ముఫ్తీ సయ్యద్ అమ్జద్ అలీ ఖాస్మీ సాహెబ్ (ఖతీబ్-ఏ-ఈదైన్, దేవరకొండ) ఆధ్వర్యంలో


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply