కొండమల్లెపల్లి: ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగి, చేపట్టే ప్రతి కార్యం విజయవంతంగా, నిర్విఘ్నంగా సాగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.
గురువారం కొండమల్లెపల్లి మండలం గౌరీకుంట తండా, గుమ్మడవెల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద రమావత్ రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ చేపట్టే మంచి కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా విఘ్నేశ్వరుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నారు.
అనంతరం ఆయా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
📰 Ayush 24 News – The Voice of Truth
విఘ్నేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలి – బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
కొండమల్లెపల్లి: ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగి, చేపట్టే ప్రతి కార్యం విజయవంతంగా, నిర్విఘ్నంగా సాగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. గురువారం కొండమల్లెపల్లి మండలం గౌరీకుంట తండా, గుమ్మడవెల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply