దేవరకొండ, సెప్టెంబర్ 17: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు దేవరకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
నిమజ్జన మార్గంలో విద్యుత్ తీగలు అడ్డుగా రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రోడ్డు మ్యాప్, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, నిమజ్జన ప్రాంతంలో భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డీఎస్పీ, తహసీల్దార్‌తో పాటు పోలీస్, మత్స్య, వైద్య, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice of Truth
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
దేవరకొండ, సెప్టెంబర్ 17: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు దేవరకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నిమజ్జన మార్గంలో విద్యుత్ తీగలు అడ్డుగా రాకుండా ముందస్తు


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply