Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › సర్ ప్రక్రియ గడువు మళ్లీ పొడిగించే ఉద్దేశం లేదు: సుదర్శన్‌రెడ్డి
బ్రేకింగ్ న్యూస్

సర్ ప్రక్రియ గడువు మళ్లీ పొడిగించే ఉద్దేశం లేదు: సుదర్శన్‌రెడ్డి

05:50 తెల్లవారుజాము AM

నవంబర్ 5లోగా మిగిలిన ఓటర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు

హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించే ఉద్దేశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినందున, ప్రస్తుతం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్ ప్రక్రియను పూర్తి చేయడమే ఎన్నికల సంఘం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 65 లక్షల మంది నోటీసులకు సమాధానం ఇచ్చినట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.

వీరిలో 54 లక్షల మందిని తుది ఓటరు జాబితాలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. నవంబర్ 5లోగా మిగిలిన ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

ఇకపై హియరింగ్ ప్రక్రియ ఉండదని, దాని స్థానంలో అవసరమైన డాక్యుమెంట్లను సేకరించే ప్రక్రియ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. నోటీసులు అందుకున్న వారి ఇళ్లకే బూత్ లెవల్ అధికారులు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు సేకరించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 11🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App