నవంబర్ 5లోగా మిగిలిన ఓటర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు
హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించే ఉద్దేశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినందున, ప్రస్తుతం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్ ప్రక్రియను పూర్తి చేయడమే ఎన్నికల సంఘం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 65 లక్షల మంది నోటీసులకు సమాధానం ఇచ్చినట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.
వీరిలో 54 లక్షల మందిని తుది ఓటరు జాబితాలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. నవంబర్ 5లోగా మిగిలిన ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
ఇకపై హియరింగ్ ప్రక్రియ ఉండదని, దాని స్థానంలో అవసరమైన డాక్యుమెంట్లను సేకరించే ప్రక్రియ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. నోటీసులు అందుకున్న వారి ఇళ్లకే బూత్ లెవల్ అధికారులు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు సేకరించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.










Leave a Reply