సుమారు 100 మంది కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేత
మిర్యాలగూడ, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది విద్యార్థినీ విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ జాతీయ అధ్యక్షుడు బూడిద సైదులు, కిసాన్ జిల్లా నాయకుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, నాలుగో వార్డు కౌన్సిలర్ ముట్టపాక శీను, ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జోహార్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులకు కరాటే శిక్షణ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న సీనియర్ కరాటే మాస్టర్ రామకృష్ణ నాయక్ సేవలను అభినందించారు.
కార్యక్రమంలో కరాటే మాస్టర్లు బాండవత్ శివ భారతి, ప్రవల్లిక, అజయ్, కిషోర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply