Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Home › బ్రేకింగ్ న్యూస్ › సెల్‌ఫోన్ కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న?
బ్రేకింగ్ న్యూస్

సెల్‌ఫోన్ కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న?

12:10 మధ్యాహ్నం PM

అన్నదమ్ముల మధ్య ఘర్షణలో తమ్ముడు మృతి

వరంగల్, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): వరంగల్ జిల్లా కేంద్రంలోని 16వ డివిజన్ గరీబ్‌నగర్‌లో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు మృతి చెందాడు. అన్న చేతిలో తమ్ముడు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. గరీబ్‌నగర్‌కు చెందిన ప్రవీణ్, ప్రసాద్ అన్నదమ్ములు. ఇటీవల ప్రసాద్ కొత్త సెల్‌ఫోన్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో అతని పాత సెల్‌ఫోన్‌ను తనకు ఇవ్వాలని ప్రవీణ్ కోరినట్లు సమాచారం. ఈ విషయమై శనివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.

ఇప్పటికే కుటుంబంలో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. సెల్‌ఫోన్ విషయానికి సంబంధించిన వివాదం తోడవడంతో ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రవీణ్ ఆవేశానికి లోనై ప్రసాద్‌పై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో గరీబ్‌నగర్‌లో భయాందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న గీసుకొండ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 43🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App