Saturday, 31 Oct 2026
31 Oct 2026Saturday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● 42 ఏళ్ల విశిష్ట సేవల అనంతరం భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ పదవీ విరమణ● బంగాళాఖాతంలో తొలిసారిగా బిమ్స్‌టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు● భారత ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, సామాజిక పరివర్తనలో గాయత్రీ పరివార్ సేవలు అమూల్యం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా● సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళులు● మృతిచెందిన ఆటో డ్రైవర్ శంకర్ కుటుంబానికి రూ.22,200 ఆర్థిక సహాయం● పార్టీలకు అతీతంగా తరలివచ్చి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు పొందాలి: దుద్దిళ్ల శ్రీనుబాబు● నల్గొండ వైద్య శాఖలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం● ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!● 42 ఏళ్ల విశిష్ట సేవల అనంతరం భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ పదవీ విరమణ● బంగాళాఖాతంలో తొలిసారిగా బిమ్స్‌టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు● భారత ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, సామాజిక పరివర్తనలో గాయత్రీ పరివార్ సేవలు అమూల్యం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా● సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళులు● మృతిచెందిన ఆటో డ్రైవర్ శంకర్ కుటుంబానికి రూ.22,200 ఆర్థిక సహాయం● పార్టీలకు అతీతంగా తరలివచ్చి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు పొందాలి: దుద్దిళ్ల శ్రీనుబాబు● నల్గొండ వైద్య శాఖలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం● ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!
Home › బ్రేకింగ్ న్యూస్ › 🚨 నేరేడ్‌మెట్‌లో కాంగ్రెస్‌లోకి కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్

🚨 నేరేడ్‌మెట్‌లో కాంగ్రెస్‌లోకి కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి

12:54 మధ్యాహ్నం PM

మైనంపల్లి హనుమంత్ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరిక

నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): నేరేడ్‌మెట్ తాజా మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజానాయకుడు మైనంపల్లి హనుమంత్ నాయకత్వంపై విశ్వాసంతో కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన తెలిపారు.

ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, కష్టసమయాల్లో ప్రజలకు అండగా నిలవడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు తనను మైనంపల్లి హనుమంత్ నాయకత్వం వైపు ఆకర్షించాయని ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మైనంపల్లి హనుమంత్ ప్రజల సమస్యలపై స్పందిస్తూ, పదవులతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉండే నాయకుడిగా తనకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి అండగా నిలుస్తారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు, నేరేడ్‌మెట్‌లో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఉపేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు, కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు.

“మైనంపల్లి హనుమంత్ నాయకత్వంలో ప్రజాసేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం గర్వంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం నా శక్తివంచన లేకుండా పనిచేస్తాను” అని ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
100 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App