విఘ్నాలు తొలగి.. చేపట్టిన ప్రతి కార్యం నిర్విఘ్నంగా సాగాలని ప్రార్థన
దేవరకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 15 | AYUSH24 NEWS:
వినాయక చవితి సందర్భంగా ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.
గుడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన రమావత్ రవీంద్ర కుమార్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజలు చేపట్టే మంచి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తికావాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి, స్థానిక సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పలువురు సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
📰 AYUSH24 NEWS
The Voice of Truth
దేవరకొండ ప్రతినిధి











Leave a Reply