Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › ఉమ్మడి నల్లగొండ › అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి నల్లగొండ

అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

12:30 తెల్లవారుజాము AM

పోషణ మాసం కార్యక్రమంలో డిండి సెక్టార్ సూపర్‌వైజర్ ఎం. రేణుక

డిండి: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)

పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిండి సెక్టార్ సూపర్‌వైజర్ ఎం. రేణుక సూచించారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సోమవారం చెరుకుపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ఒక్కపూట సంపూర్ణ భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఐరన్, కాల్షియం లోపాలు తలెత్తకుండా రాగిజావ, బెల్లం, పల్లీలు, ఆకుకూరలు, సీజనల్ పండ్లు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని తెలిపారు. పిల్లలు తీసుకునే ఆహారంపై ప్రతి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

రైతులు జొన్నలు, సద్దలు వంటి పంటలను పండించడంతో పాటు తమ కుటుంబ ఆహారంలోనూ వాటిని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. శిశువుల ఆరోగ్యం, పోషణపై ఐసీడీఎస్ విభాగం నిరంతరం పర్యవేక్షిస్తూ కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్, కార్యదర్శి, అంగన్వాడీ టీచర్ పార్వతమ్మ, ఆశా కార్యకర్త, వార్డు సభ్యులు, కిశోర బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 27🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App