ఇల్లెందుకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఘన సన్మానం.. అభినందనలు తెలిపిన టేకులపల్లి కాంగ్రెస్ శ్రేణులు
ఇల్లెందు, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇల్లెందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గురువారం హైదరాబాద్ నుంచి ఇల్లెందు నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు.

ఎమ్మెల్యే కోరం కనకయ్యను పుష్పగుచ్ఛాలతో అభినందించి, శాలువాలతో సత్కరించారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచుకొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కినేని శ్యాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఖాదర్ బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వారితో పాటు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోర్నాల విజయమోహన్‌రావు, ఈది గణేష్, బుర్ర ధర్మయ్య గౌడ్, సర్దార్ నాయక్, రవి నాయక్, కుంజ పోశాలు, రెడ్యా నాయక్, బొడ్డు అశోక్ గౌడ్, యాసారపు నర్సయ్య గౌడ్, యాసారపు జానయ్య గౌడ్, నారం దాసు, నరసింహారావు, పోశం సాగర్, బండి శంకర్ గౌడ్, కొండాల సంతోష్, మొగలగాని రాజు గౌడ్, వాంకుడోత్ మాన్సింగ్, మూడు సంజయ్ నాయక్, ఆకుల వెంకటేశ్వరరావు, దోర్నాల శ్రీనివాసరావు, వాంకుడోత్ బాలు నాయక్, సత్యసాయి గౌడ్, లాల్‌జాన్ భాష, లావుడియా సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే కోరం కనకయ్యకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply