బీజేపీ నేరేడుగొమ్ము మండల అధ్యక్షులు నాగిళ్ల ఆంజనేయులు
నేరేడుగొమ్ము: కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఇల్లు ధ్వంసం కావడంతో పాటు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి భౌతిక దాడికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డా. వర్షిత్ రెడ్డి గారిని పరామర్శించేందుకు నల్గొండకు వెళ్లాల్సి ఉండగా, తనను హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని బీజేపీ నేరేడుగొమ్ము మండల అధ్యక్షులు నాగిళ్ల ఆంజనేయులు ఆరోపించారు.
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు బదులుగా బీజేపీ నాయకులను నిర్బంధిస్తోందని ఆయన విమర్శించారు. దాడికి గురైన బీజేపీ కుటుంబానికి అండగా నిలిచేందుకు నల్గొండ వెళ్లకుండా తనను అడ్డుకోవడం అన్యాయమని అన్నారు.
“అక్రమ అరెస్ట్‌లతో బీజేపీ ఉద్యమాన్ని ఆపలేరు” అని నాగిళ్ల ఆంజనేయులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారిలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గుండ్లపల్లి వెంకటేష్, సీనియర్ నాయకులు ఐతరాజు కొండల్ తదితరులు ఉన్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply