– జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న
జీడబ్ల్యూఎంసీ, ఆగస్టు 22, అయుష్ 24 న్యూస్: రోజువారీ విధి నిర్వహణలో అధికారులు వాకీటాకీలను సమర్థవంతంగా వినియోగించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న సూచించారు.శుక్రవారం బల్దియా కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులకు వాకీటాకీలను కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో అధికారుల మధ్య వేగవంతమైన సమాచార మార్పిడి, సమన్వయానికి వాకీటాకీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.విధి నిర్వహణ సమయంలో సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి, వాకీటాకీల ద్వారా సమాచారాన్ని వేగంగా చేరవేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం మరింత మెరుగుపడేలా వాకీటాకీలను నిరంతరం అందుబాటులో ఉంచుకుని సమర్థవంతంగా వినియోగించాలని ఆయన ఆదేశించారు.










Leave a Reply