మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన

దేవరకొండ, ఆగస్టు 20 — అయుష్ 24 న్యూస్:
నేరేడుగొమ్ము మండలం పేర్వాల గ్రామ సర్పంచ్ టేకులపల్లి నాగయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లోని హస్తినాపురం మమత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గురువారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ సర్పంచ్ నాగయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించడంతో పాటు త్వరగా కోలుకునేలా అవసరమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
సర్పంచ్ నాగయ్య త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి గ్రామ ప్రజలకు అందుబాటులోకి రావాలని ఎమ్మెల్యే బాలు నాయక్ ఆకాంక్షించారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply