మంత్రి శ్రీధర్ బాబు చొరవతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా వైద్య సహాయం
మంథని, ఆగస్టు 17: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంథని నియోజకవర్గం మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన తాటిపెళ్లి ప్రమోద్కు వైద్య చికిత్స కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో రూ.3,50,000 విలువైన ఎల్‌ఓసీ (LOC) మంజూరైంది.
పెద్దంపేట గ్రామానికి చెందిన తాటిపెళ్లి ప్రమోద్ (తండ్రి: రాజబాబు) అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే సీఎంఆర్‌ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.3.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.
హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆసుపత్రి సహాయకులు కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా చికిత్స కోసం రూ.3.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ప్రమోద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
“దుద్దిళ్ల హస్తం – పేదల నేస్తం”
— అయుష్ 24 న్యూస్










Leave a Reply