వెంకటయ్య తండ్రి చిన్న రామయ్యకు నివాళులర్పించిన కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు
కుల్కచర్ల, ఆగస్టు 31 (అయుష్ 24 న్యూస్): కుల్కచర్ల మండలం రాంనగర్ గ్రామానికి చెందిన పోలేమోని వెంకటయ్య తండ్రి పోలేమోని చిన్న రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు.
ఈ విషయం రాంనగర్ గ్రామానికి చెందిన తన అనుచరుల ద్వారా తెలుసుకున్న కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ రాజేశ్వరమ్మ సోమవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్న రామయ్య పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply