చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్. రాము చౌహాన్
దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:
గాజుల రాజేష్ కుమారుడు కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ సంస్మరణ సభ శనివారం దేవరకొండలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మలక్‌పేట సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహాన్ సంస్మరణ సభకు హాజరై అభినయ్ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎస్. రాము చౌహాన్ మాట్లాడుతూ అకాల మరణం పొందిన కీర్తిశేషులు అభినయ్ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
అభినయ్ రాజ్ తల్లిదండ్రులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో రాజేష్ కుటుంబానికి ఎల్‌ఐసీ మిత్రులు, ఏజెంట్లు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండకు చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్లు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొని కీర్తిశేషులు అభినయ్ రాజ్‌కు నివాళులర్పించారు.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply