పవిత్ర శ్రావణ మాసంలో మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రతినిధుల దైవ దర్శనం
మంథని, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్
పవిత్ర శ్రావణ మాసంలోని మంగళవారాన్ని పురస్కరించుకుని మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రెస్ క్లబ్ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోడారి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. మనిషికి ఆధ్యాత్మిక జీవనమే పరమానందమని అన్నారు. మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ రోజురోజుకూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. క్లబ్ సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామివార్లను ప్రార్థించినట్లు తెలిపారు.
క్లబ్ ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ దైవ దర్శనం సభ్యుల్లో భక్తి భావంతో పాటు నూతనోత్తేజాన్ని నింపిందన్నారు. క్లబ్ సభ్యులతో పాటు ప్రజలందరికీ శుభం కలగాలని స్వామివార్లను ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్, మేడగోని రాజమౌళి గౌడ్, ఏగోలపు సంతోష్ గౌడ్, కాచర్ల శంకర్, ఎండి సుభాన్, రామడుగు సాయి శ్రీనివాస్, మాదేశి శ్రావణ్ కుమార్, మంథని లక్ష్మణ్, కాశీపేట శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, కావేటి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం సభ్యులు స్వామివార్ల తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రెస్ క్లబ్ భవిష్యత్ కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.










Leave a Reply