రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రవీణ్‌ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్
ఇల్లందు, ఆగస్టు 22, అయుష్ 24 న్యూస్: ఎర్రాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చింతలకట్ట గ్రామానికి చెందిన ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ ఆసుపత్రికి వెళ్లి ప్రవీణ్‌ను పరామర్శించారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రవీణ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని కోరం సురేందర్ ఆకాంక్షించారు.










Leave a Reply