బంజారా సంక్షేమ అసోసియేషన్ ఆహ్వానంతో పాల్గొన్న ఆర్‌టీఐ సర్వీస్ సొసైటీ ప్రతినిధులు
ఇంజాపూర్: ఇంజాపూర్ బంజారా సంక్షేమ అసోసియేషన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు కాలనీలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఇంజాపూర్ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తుల్జా భవాని నగర్ మాజీ వార్డు సభ్యులు కొర్ర రమేష్, ప్రముఖ నాయకులు రామలింగం, కొర్ర శంకర్, ఆనంద్, ప్రవీణ్, మోహన్, ఇతర వార్డు సభ్యులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత
ఈ సందర్భంగా కేతావత్ బాబురామ్ నాయక్ మాట్లాడుతూ, బంజారా సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు పవిత్రమైన తీజ్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, అన్నదమ్ములు సుఖసంతోషాలతో ఉండాలని ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ తీజ్ అని పేర్కొన్నారు.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని, ఇలాంటి పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఉత్సవాల్లో సంప్రదాయ దుస్తులు ధరించిన యువతుల నృత్యాలు, తీజ్ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం నిర్వాహకులు, కాలనీ పెద్దలు అతిథులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఇంజాపూర్ బంజారా సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళలు, యువకులు, కాలనీ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీజ్ ఉత్సవాలను విజయవంతం చేశారు.
అయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply