దేవరకొండ, ఆగస్టు 26: దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామానికి చెందిన పులిజాల సాధన–ఎల్లయ్య దంపతులకు ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో మంజూరైన ఇందిరమ్మ ఇంటిని స్థానిక సర్పంచ్, గిరిజన సర్పంచుల ఫోరమ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొర్ర రాంసింగ్ నాయక్ బుధవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులతో కలిసి రాంసింగ్ నాయక్ నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే బాలునాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, వార్డు సభ్యులు పులిజాల సంతోష్, వెంకట్, నాగరాజు, సునీత, బద్దు నాయక్, లక్ష్మీ, ప్రశాంత్‌తో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply