తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నివాళులు
తెలంగాణ విమోచన పోరాటంలో ఎందరో ఉద్యమకారులు, రైతులు, యువత తమ ప్రాణాలను త్యాగం చేశారని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటంలో పాల్గొన్న వారి ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ విమోచన ఉద్యమ చరిత్రను యువత, విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గోపీచంద్ అన్నారు. చరిత్రను వాస్తవిక దృక్పథంతో అధ్యయనం చేయడంతో పాటు దేశ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతలను కాపాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న వీరులకు ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.










Leave a Reply