Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Home › బ్రేకింగ్ న్యూస్ › ఇళ్ల స్థలాల కోసం పోరుబాట పట్టిన జర్నలిస్టులు
బ్రేకింగ్ న్యూస్

ఇళ్ల స్థలాల కోసం పోరుబాట పట్టిన జర్నలిస్టులు

08:59 ఉదయం AM

టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఆధ్వర్యంలో నల్లగొండలో రిలే నిరాహార దీక్ష

సంఘీభావం తెలిపిన దేవరకొండ డివిజన్ జర్నలిస్టులు

దేవరకొండ, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు దేవరకొండ డివిజన్ జర్నలిస్టులు శనివారం సంఘీభావం తెలిపారు.

టీయూడబ్ల్యూజే–ఐజేయూ దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు గాదె గిరిధర్ రావు నేతృత్వంలో వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులు దీక్షా శిబిరానికి హాజరై తమ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా గాదె గిరిధర్ రావు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యపై సానుకూలంగా స్పందించి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని, సమస్య పరిష్కారం కాకపోతే డివిజన్ స్థాయిలోనూ రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు.

జర్నలిస్టులు సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని గాదె గిరిధర్ రావు అన్నారు. పరిమిత ఆదాయంతో వృత్తిని కొనసాగిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని గాదె గిరిధర్ రావు పేర్కొన్నారు. అవినీతి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం–ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిగా పనిచేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ దేవరకొండ డివిజన్ ఉపాధ్యక్షుడు ఖాజా మొహీనుద్దీన్, కార్యదర్శి మడ్ల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి బూడిద శ్రీనివాస్ యాదవ్, సహాయ కార్యదర్శి ఇలియాస్ బాబాతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 204🔗 Shares: 7👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
220 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App