ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు, ఫోర్ వీలర్లకు రూ.30 వేల డీడీ
దేవరకొండ, సెప్టెంబర్ 1: దేవరకొండ డివిజన్ పరిధిలో వివిధ నాటుసారా తయారీ, సరఫరా కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 3వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
దేవరకొండ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వేలంపాటలో పాల్గొనదలచిన ఆసక్తిగల కొనుగోలుదారులు ఎక్సైజ్ శాఖ పేరుతో ద్విచక్ర వాహనాలకు రూ.10,000, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.30,000 డీడీ తీసుకురావాలని సూచించారు.
ఆసక్తిగల కొనుగోలుదారులు నిర్ణీత సమయానికి ఎక్సైజ్ కార్యాలయానికి హాజరై వేలంపాటలో పాల్గొనాలని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ కోరారు.
అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply