పట్టణ పారిశుద్ధ్యంపై మరింత బాధ్యతగా పనిచేస్తా: శంకర్ గౌడ్
దేవరకొండ | ఆయుష్ 24 న్యూస్
80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ సురిగి శంకర్ గౌడ్ ఉత్తమ శానిటరీ ఇన్స్పెక్టర్‌గా అవార్డు అందుకున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా శనివారం ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 2026–27 సంవత్సరానికి దేవరకొండ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్‌గా అందించిన ఉత్తమ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు ఈ పురస్కారాన్ని అందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తనకు ఉత్తమ శానిటరీ ఇన్స్పెక్టర్‌గా అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన సేవలను గుర్తించి ప్రోత్సహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
అవార్డు తన బాధ్యతను మరింత పెంచింది
పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని శంకర్ గౌడ్ తెలిపారు. తన విధి పట్ల ప్రభుత్వం, ప్రజలు, ప్రజాప్రతినిధులు చూపిన గుర్తింపుగా ఈ అవార్డును భావిస్తున్నానన్నారు.
ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, దేవరకొండ పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, పారిశుద్ధ్య రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శంకర్ గౌడ్ తెలిపారు.
— ఆయుష్ 24 న్యూస్










Leave a Reply