Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › బ్రేకింగ్ న్యూస్ › ఉత్తమ సేవలకు నంది అవార్డు
బ్రేకింగ్ న్యూస్

ఉత్తమ సేవలకు నంది అవార్డు

03:41 మధ్యాహ్నం PM

మట్టిలో మాణిక్యం.. దేవరకొండ మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేతావత్ నగేష్‌కు సత్కారం

దేవరకొండ, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): మిషన్ భగీరథ విభాగంలో ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ దేవరకొండ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేతావత్ నగేష్‌కు గ్లోబల్ ఎక్సలెంట్ ఐకాన్ 2026 అమేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వీస్ ఓరియెంటెడ్ ఆఫీసర్ నంది అవార్డు అందజేశారు.

ఆదివారం హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు షియాన్స్ అమర్ సింగ్, షియాన్స్ కేశవ్ గౌడ్, చైతన్య మాస్టర్ తదితరులు కేతావత్ నగేష్‌ను శాలువాతో సత్కరించి, నంది అవార్డు, జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేతావత్ నగేష్ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ మిషన్ భగీరథలో ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నారని తెలిపారు. దేవరకొండ డివిజన్ పరిధిలో ప్రజలకు తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించినప్పటికీ, ప్రజలకు సేవ చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. తండాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

మిషన్ భగీరథ రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల ప్రశంసలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభినందనలు లభిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆయన సేవలను గుర్తిస్తూ తమ సంస్థ తరఫున సర్వీస్ ఓరియెంటెడ్ ఆఫీసర్ నంది అవార్డుతో సత్కరించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో షియాన్స్ అమర్ సింగ్, షియాన్స్ కేశవ్ గౌడ్, చైతన్య మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 145🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
220 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App