అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి
దోమ, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: దోమ మండలం ఉదన్‌రావుపల్లి గ్రామంలో శ్రీ అంజనేయ స్వామి, నవగ్రహాలు, కాలభైరవ స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభం, నాగశిల ప్రతిష్ఠా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక వేడుకలకు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను బలోపేతం చేసే కేంద్రాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని, ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply