Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › ఉపాధ్యాయురాలి పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం
బ్రేకింగ్ న్యూస్

ఉపాధ్యాయురాలి పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం

తెల్కపల్లి: విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తూ సుమారు 41 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించిన శ్రీమతి మంద వెంకటరెడ్డి కౌసల్యమ్మ పదవీ విరమణ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు ఘనంగా సన్మానించారు. కౌసల్యమ్మ గారు 16-09-1965న జన్మించారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంచుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు.

01:47 మధ్యాహ్నం PM

తెల్కపల్లి: విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తూ సుమారు 41 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించిన శ్రీమతి మంద వెంకటరెడ్డి కౌసల్యమ్మ పదవీ విరమణ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు ఘనంగా సన్మానించారు.

కౌసల్యమ్మ గారు 16-09-1965న జన్మించారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంచుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. 1981 ఫిబ్రవరి 14న చింతపల్లి గ్రామ మానవతీ? పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలను ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు.

1985 డిసెంబర్ 17న ఎం.యు.పి.ఎస్. లక్ష్మాపూర్ యందు మొదటి నియామకం పొందిన ఆమె, అనంతరం పి.ఎస్., తెల్కపల్లి, మహదేవపూర్ తదితర పాఠశాలల్లో సేవలందించారు. 2006లో ఎస్.ఏ.గా పదోన్నతి పొంది, కోడలికుంట, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో కూడా విధులు నిర్వహించారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేశారు.

ఉపాధ్యాయురాలిగా తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలతో మెలుగుతూ, వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశారు. సహచర ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ఉంటూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు.

సుమారు 41 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలో ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన కౌసల్యమ్మ సేవలను పలువురు కొనియాడారు. ఆమె పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

పదవీ విరమణ అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సత్కరించారు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 37🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App