దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి, నిధుల మంజూరు, ప్రజా సమస్యలపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ , ఆయన తనయుడు, యువ నాయకుడు నేనావత్ దేవరన్ నాయక్ హైదరాబాద్లోని ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల మంజూరు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో ఎమ్మెల్యే బాలు నాయక్ గారు కూలంకషంగా చర్చించారు.
నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వివిధ అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సహకారంతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే బాలు నాయక్ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీమ్ బాలు నాయక్, టీమ్ దేవరన్ నాయక్, సోషల్ మీడియా టీమ్, దేవరకొండ నియోజకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply