ధర్మం, కర్తవ్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక సమానత్వంపై యువతకు సందేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిర్వహించిన వేడుకల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ గుజ్జ సత్యం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, యువతతో కలిసి శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మం, కర్తవ్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక సమానత్వం వంటి విలువలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
శ్రీకృష్ణుడి బోధనలు నేటి యువతకు ఎంతో గొప్ప మార్గదర్శకమని గుజ్జ సత్యం పేర్కొన్నారు. ధర్మం కోసం నిలబడుతూ, సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు, శ్రేయస్సును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, యువతకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

గుజ్జ సత్యం
జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
స్టేట్ కోఆర్డినేటర్ – బీసీ జేఏసీ



Mahamood Mohammed





Leave a Reply