నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్
కిష్టారం, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: హైదరాబాద్‌లో నర్స్ ఊకె శిరీష మృతి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కిష్టారం గ్రామంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కిష్టారం, లచ్చగూడెం గ్రామాల ప్రజలు ర్యాలీలో పాల్గొని శిరీషకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. శిరీష మృతి ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వేగంగా మరియు సమగ్రంగా దర్యాప్తు చేపట్టి, నేరం రుజువైతే బాధ్యుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. శిరీష కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.
గ్రామస్థుల ఘన నివాళి
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న కిష్టారం, లచ్చగూడెం గ్రామాల ప్రజలు శిరీష చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిష్టారం సర్పంచ్ కోర్స రామకృష్ణ, తుడుం దెబ్బ సాంస్కృతిక కార్యదర్శి చింత సంపత్, లచ్చగూడెం మాజీ సర్పంచ్ జోగా లక్ష్మణ్, కిష్టారం ఉపసర్పంచ్ కురసం లక్ష్మీనారాయణ, కురసం నాగేశ్వరరావు, వార్డు సభ్యులు మాడే సుక్కమ్మ, కంగల చంద్రకళ, కొరసా దేవరాజ్, పెద్దమనిషి కంగల భద్రయ్య, కిష్టారం యూత్ లీడర్ బొల్లి కృష్ణతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ 📰










Leave a Reply