Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కాప్రా డివిజన్‌లో ఓటరు నమోదు దిశానిర్దేశక సమావేశం
బ్రేకింగ్ న్యూస్

ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కాప్రా డివిజన్‌లో ఓటరు నమోదు దిశానిర్దేశక సమావేశం

కాప్రా, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్): ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించారు. కాప్రా డివిజన్ గాంధీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో డివిజన్

06:27 ఉదయం AM

కాప్రా, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్): ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించారు. కాప్రా డివిజన్ గాంధీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో డివిజన్ కోఆర్డినేటర్ సీతారాం రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు శ్రీహరి తన్నీరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డివిజన్ కోఆర్డినేటర్ సీతారాం రెడ్డి మాట్లాడుతూ.. 2023కు ముందు డిగ్రీ పట్టా పొందిన అర్హులైన అభ్యర్థులు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను ఎలా నమోదు చేసుకోవాలో కార్యకర్తలకు వివరించారు. అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.
కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కొబ్బెరినూరి నాగ శేషు కూడా పట్టభద్రుల ఓటరు నమోదు విధానంపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మేడ్చల్‌–మల్కాజిగిరి మార్కెటింగ్ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కొబ్బెరినూరి నాగరాజు, శ్రీకాంత్, శ్రీధర్ రెడ్డి, రాకేష్ యాదవ్, నరేందర్ గౌడ్, జగదీష్ గౌడ్, సత్యనారాయణ, కాప్రా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, నాగరాజు, ఎస్.ఆర్. ఖాన్, సంతోష్, సత్తి, నర్సింగ్, స్వర్ణలత, మనోజ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
– ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 8🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App