కాప్రా, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్): ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించారు. కాప్రా డివిజన్ గాంధీనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో డివిజన్ కోఆర్డినేటర్ సీతారాం రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు శ్రీహరి తన్నీరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డివిజన్ కోఆర్డినేటర్ సీతారాం రెడ్డి మాట్లాడుతూ.. 2023కు ముందు డిగ్రీ పట్టా పొందిన అర్హులైన అభ్యర్థులు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను ఎలా నమోదు చేసుకోవాలో కార్యకర్తలకు వివరించారు. అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.
కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కొబ్బెరినూరి నాగ శేషు కూడా పట్టభద్రుల ఓటరు నమోదు విధానంపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మేడ్చల్–మల్కాజిగిరి మార్కెటింగ్ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కొబ్బెరినూరి నాగరాజు, శ్రీకాంత్, శ్రీధర్ రెడ్డి, రాకేష్ యాదవ్, నరేందర్ గౌడ్, జగదీష్ గౌడ్, సత్యనారాయణ, కాప్రా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, నాగరాజు, ఎస్.ఆర్. ఖాన్, సంతోష్, సత్తి, నర్సింగ్, స్వర్ణలత, మనోజ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
– ఆయుష్ 24 న్యూస్
ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కాప్రా డివిజన్లో ఓటరు నమోదు దిశానిర్దేశక సమావేశం
కాప్రా, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్): ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించారు. కాప్రా డివిజన్ గాంధీనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో డివిజన్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply