5 డే బ్యాంకింగ్‌తో పాటు ఉద్యోగుల సమస్యలపై చర్చ
హైదరాబాద్: ఎస్‌బీఐ కోఆర్డినేషన్ కమిటీ రెండో సమావేశం 31-08-2026న ఎస్‌బీఐ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌బీఐ ఉద్యోగులు, సభ్యులకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా 5 డే బ్యాంకింగ్ విధానంపై చర్చ జరిగినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు
🔹 ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్
ప్రధాన కార్యదర్శి ఆంజనేయ ప్రసాద్ గారు, అధ్యక్షులు శంకర్ గారు
🔹 ఎస్‌బీఐఎస్‌యూహెచ్‌సీ (SBISUHC)
ప్రధాన కార్యదర్శి శాండిల్య గారు, అధ్యక్షులు శ్రీధర్ గారు
🔹 ఎస్‌సీ/ఎస్‌టీ ఎస్‌బీఐ వెల్ఫేర్ అసోసియేషన్
అధ్యక్షులు సూర్యం గారు, ప్రధాన కార్యదర్శి భార్గవ్ గారు
🔹 ఎస్‌బీఐ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్
అధ్యక్షులు NVT గారు, ప్రధాన కార్యదర్శి రాజు కొమ్మిరిశెట్టి గారు
సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, సభ్యుల సమస్యలు, 5 డే బ్యాంకింగ్ అమలు తదితర అంశాలపై పరస్పరం చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 🌹🙏
అయుష్ 24 న్యూస్










Leave a Reply