నల్గొండ ఏఓ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు పదవీ విరమణ కార్యక్రమం
మహబూబ్‌నగర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్, జోగులాంబ ప్రాంతాల సంయుక్త ప్రాంతీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నల్గొండ ఏఓ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి, ఆయన బ్యాంకు ఉద్యోగుల కోసం అందించిన సేవలను నాయకులు, ఉద్యోగులు కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, యూనియన్ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply