విద్యార్థులకు నాణ్యమైన వసతులు, భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచన
పరిగి, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: పరిగి నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లపై పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (టీఆర్‌ఆర్) సమీక్ష నిర్వహించారు.
పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సమస్యలు తదితర అంశాలపై వార్డెన్లను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన వసతులు, పౌష్టికాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, వార్డెన్లకు సూచించారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని హాస్టళ్లలో కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
అయుష్ 24 న్యూస్ 📰










Leave a Reply